- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ నేతకు పాకిస్తాన్ నుంచి ఫోన్
దిశ, ముధోల్: తనను చంపుతానని పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకండి రమాదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 12న +923481411535 మొబైల్ నంబర్ నుంచి అర్ధరాత్రి సమయంలో వరుసగా మూడుసార్లు తన మొబైల్‌కు కాల్ చేసి చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్లు, మైనర్ బాలికపై లైంగిక దాడి విషయంలో జోక్యం చేసుకోవద్దని బెదిరించారని పేర్కొన్నారు. తన వాట్సాప్‌కు మెసేజ్‌లు కూడా పెట్టారని చెప్పారు. భైంసా అల్లర్లకు సంబంధించి పాకిస్థాన్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్ పై పోలీసులు విచారణ చేపట్టాలని కోరారు. ఇదే విషయమై హైదరాబాద్ సైబర్ క్రైమ్, డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు వివరించారు. బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను కూడా మీడియాకు అందజేశారు.