వ్యాక్సిన్ తీసుకోవడం ఇష్టం లేదంటున్న ఆ దేశ పౌరులు..

by Sujitha Rachapalli |
vaccine-aganst-ryali
X

దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ఇప్పటికే వందశాతం ప్రక్రియ పూర్తికాగా.. పలు దేశాలను ఇంకా టీకాల కొరత వేధిస్తోంది. అయితే వ్యాక్సిన్లపై తొలుత అన్ని దేశాల్లోనూ వ్యతిరేకత ఎదురైనా, అవేర్‌నెస్ పెంచడంలో ఆయా ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి. ఈ మేరకు ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటున్న తరుణంలో.. గ్రీక్‌‌ పౌరులు యాంటీ-వ్యాక్సిన్ ర్యాలీ చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

గ్రీక్‌లో కరోనా వైరస్ ప్రోగ్రామ్‌ను వ్యతిరేకిస్తూ దాదాపు 5 వేలకు పైగా యాంటీ వ్యాక్సిన్ ప్రొటెస్టర్స్.. గ్రీక్ జెండాలు, చెక్క శిలువలు ప్రదర్శిస్తూ ఏథెన్స్‌లో ర్యాలీ చేపట్టారు. ‘టేక్ యువర్ వ్యాక్సిన్స్ అండ్ గెట్‌అవుట్ ఆఫ్ హియర్’ అని నినాదాలు చేయడంతో పాటు ప్రధాని రిజైన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసనకారులు పార్లమెంట్ బయట పెద్ద ఎత్తున గుమిగూడారు. కాగా వ్యాక్సినేషన్‌పై గ్రీకులోని స్కాయ్ టీవీ పోల్ చేపట్టగా.. ఎక్కువ మంది పౌరులు టీకా వేయించుకునేందుకే ఇంట్రెస్ట్ చూపించినట్టు వెల్లడైంది. ఇక ఇప్పటికే 41 శాతం గ్రీకు పౌరులు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు తెలిసింది. అయితే టూరిజం సీజన్ మొదలవడం వల్ల కొత్తగా COVID-19 ఇన్ఫెక్షన్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హెల్త్ వర్కర్స్, నర్సింగ్ హోమ్ స్టాఫ్‌కు తప్పనిసరిగా టీకాలు వేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. ఈ క్రమంలో వారి నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

‘ప్రతీ వ్యక్తికి నచ్చింది ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. అంతేగానీ ప్రభుత్వం సూచించిందే ఎన్నుకోవాలంటే కష్టం’ అని కార్డియాలజిస్ట్ ఫైడన్ వొవోలిస్ పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు, టీకా పరిశోధనలపైన శాస్త్రీయ పరిశోధలను ప్రశ్నించిన ఈయన ‘ఫ్రీ అగైన్’ ఉద్యమానికి నాయకత్వం వహించారు. వైరస్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు ప్రతిస్పందనగా తను ఒక గ్రూప్ ప్రారంభించినట్టు తెలిపాడు. అయితే గ్రీకులో నిరసనలు కొత్తేం కాదు. ఈ మధ్య కాలంలో కొత్తగా రూపొందించిన కార్మిక చట్టం నుంచి గాజాపై ఇటీవలి ఇజ్రాయెల్ మిలిటరీ క్యాంపెయిన్ వరకు చాలా అనేక నిరసనలు జరిగాయి.

Advertisement

Next Story

Most Viewed