‘ఆ జిల్లాల్లో 8 వారాల లాక్‌డౌన్ అవసరం’

by Shamantha N |   ( Updated:2021-05-12 11:50:54.0  )
‘ఆ జిల్లాల్లో 8 వారాల లాక్‌డౌన్ అవసరం’
X

న్యూఢిల్లీ: కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువున్న జిల్లాల్లో 6-8 వారాలపాటు లాక్‌డౌన్ విధించాల్సిన అవసరముందని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) సూచించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు సహా ఇప్పటికే దేశంలోని మూడోవంతు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువే ఉందని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. హై పాజిటివిటీ రేటు కలిగి ఉన్న జిల్లాలు తప్పనిసరిగా లాక్‌డౌన్ విధించాలని సూచించారు. పాజిటివిటీ రేటు 10 నుంచి 5శాతానికి పడిపోయిన తర్వాత నిబంధనలు సడలించుకోవచ్చని వెల్లడించారు. కరోనాతో అల్లాడిపోయిన ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన తర్వాత పాజిటివిటీ రేటు 35శాతం నుంచి 17శాతానికి పడిపోయిందని ఉదహరించారు. ఈ టైంలో అక్కడ లాక్‌డౌన్ సడలిస్తే కరోనా మళ్లీ విజృంభించడం ఖాయమని హెచ్చరించారు. అలాగే, కరోనా టైంలో భారీగా గుమిగూడటం భారత్‌లోనే కాదు.. ఇంకెక్కడైనా ఆమోదయోగ్యం కాదన్నారు.

సెకండ్ వేవ్‌‌ యువతపైనే ఎక్కువ ప్రభావం

కరోనా సెకండ్ వేవ్‌ యువతపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని బలరాం చెప్పారు. నిర్లక్ష్యంగా బయట తిరగడం ఒక కారణమైతే, భారత్‌లో వెలుగుచూసిన కొత్త వేరియంట్ మరో కారణమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed