- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తదానం కోసం సరికొత్త ‘బ్లడ్.ఇన్’
దిశ, ఫీచర్స్ : కరోనా ప్రభావంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్లడ్ డోనర్స్ ముందుకు రాకపోయేసరికి ‘రక్త’ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. దీంతో సోషల్ మీడియాలో దాతల కోసం ప్రతీ రోజు పదుల సంఖ్యలో పోస్ట్‌లు కనిపించేవి. చెన్నైకి చెందిన వరుణ్ కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొవడంతో, రక్తదాతలను సమర్థవంతంగా కనెక్ట్ చేయడానికి తన స్నేహితుడు ఆదిత్య, విక్రమ్ సహాయంతో ‘బ్లడ్.ఇన్’ అనే పోర్టల్‌ను ప్రారంభించాడు. ఇందులో బ్లడ్ అవసరమున్న వ్యక్తులు, తమకు కావాల్సిన బ్లడ్ గ్రూప్, నివసిస్తున్న ప్రాంతం పిన్ కోడ్ నమోదు చేసిన వెంటనే అర్హులైన రక్తదాతల రిపోజిటరీని, వారి కాంటాక్ట్ డీటెయిల్స్‌తో పొందవచ్చు.
సోషల్ మీడియాలో ‘బ్లడ్ డోనర్స్’ నెంబర్స్ లిస్ట్ చాలా ఉంటుంది. కానీ వారి వివరాలు సరిగ్గా ఉండకపోవచ్చు, కొందరు దూర ప్రాంతాల్లో ఉండొచ్చు. అసలెవరు డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవాలి? ఇది కాస్త రిస్క్ పనే. ఇదే ఆలోచనతో వరుణ్ చెన్నైలోని 30వేల నంబర్లకు యాక్సెస్ పొందడానికి అనుమతించే స్క్రాపర్ కోడ్ చేశాడు. ఈ నంబర్ల సాయంతో వారందరికీ కాల్ చేసి వివరాలు ధృవీకరించాడు. ఈ పనిలో వరుణ్ స్నేహితులు, వారు వారి స్నేహితులు ఇలా ఇదో గొలుసుకట్టుగా వందకు పైగా విద్యార్థులు వాలంటీర్లుగా ఇందులో పనిచేసి రక్తదాతల పూర్తి డేటాను కంప్లీట్ చేసి, దీన్ని ‘బ్లడ్.ఇన్’లో పొందుపర్చారు.
‘ఇది యూజర్ ఫ్రెండ్లీ. ఉపయోగించడానికి చాలా సులభంగా డిజైన్ చేశాం. ఇటీవల ఎవరు రక్తదానం చేసారు, పోర్టల్ నుంచి ఎవర్ని తీసివేయాలి, ఎప్పుడు తిరిగి జోడించవచ్చు వంటి వివరాలు ఇప్పుడు ఆటోమేట్ చేశాం. పోర్టల్‌లో ఉన్న ప్రస్తుత దాతల సంప్రదింపు వివరాలకు హాని కలగకుండా ఉండేందుకు డేటా ఏదో ఒక రూపంలో సంరక్షించేలా అప్‌డేట్ చేస్తున్నాం. అందుకోసం నిధులు సేకరించే పనిలో ఉన్నాం.