- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవలీలగా గుర్రాన్ని ఎత్తుకున్న ‘భీమ్’
దిశ, ఫీచర్స్: గుర్రం, గేదెను అతిసులువుగా, భుజాల మీద చిన్నపిల్లాడిని ఎత్తుకున్నంత ఈజీగా లిఫ్ట్ చేసే వ్యక్తిని.. బహుశా మీరు ఎప్పుడూ చూసుండరు. మహాభారతంలో భీమునికి మాత్రమే అలాంటి పనులు సాధ్యమనుకుంటే, మీరు ఖచ్చితంగా పొరపడినట్లే. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి రియల్‌గానే అలాంటి పనులు చేస్తున్నాడు.
ఉక్రెయిన్‌కు చెందిన డిమైత్రో ఖలాది అనే వ్యక్తి.. అతి సులువుగా గుర్రం, గేదెను తన భుజాల మీద మోయగలడు. సర్కస్‌లో పని చేస్తుండే ఇతన్ని స్థానికులంతా ‘భీమ్(Bheem)’ అని పిలుస్తుంటారు. ఇప్పటికే 63 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన 41 ఏళ్ల డిమైత్రో.. ఒంటిచేత్తో 150 కిలోల బరువు మోయగల బలశాలి. ఈ మేరకు గతంలో ఆరుగురు వ్యక్తులను ఒకేసారి ఎత్తుకుని పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక గుర్రం, గేదెను తన భుజాల మీద ఎత్తుకునేప్పుడు తీసిన వీడియోలను డిమైత్రో తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇతడిని వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు ఇతర కళల్లోనూ ప్రావీణ్యముండటం విశేషం. 2009లో ‘ఉక్రెయిన్ గాట్ టాలెంట్(Ukraine’s got talent)షో’లో పార్టిసిపేట్ చేసిన డిమైత్రో.. తన వెయిట్ లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్‌తో ఫైనల్స్ వరకు వెళ్లి వెనుదిరిగాడు. అంతేకాదు ప్రముఖ అథ్లెట్స్‌పై ఆయన చేసిన రచనలకు లిటరరీ అవార్డు అందుకోవడంతో పాటు ‘ఇవన్(Ivan)’ అనే ఫిల్మ్‌లో స్ట్రాంగ్ మ్యాన్‌గా లీడ్ రోల్ ప్లే చేశాడు.
trending news