- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటలకు అవే ముప్పు తెచ్చాయా?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్కంఠగా, వివాదంగానే కొనసాగింది. మంత్రివర్గం కూర్పులో ఆయనకు స్థానం లేదని తొలుత ప్రచారం జరిగింది. దీంతో రెండోసారి ప్రభుత్వంలో ఆయనకు మంత్రిగా అవకాశం వస్తుందా?.. రాదా? అనే మీమాంసలో ఉన్న సమయంలోనే కేబినెట్ ప్రమాణస్వీకారానికి ముందు ఆర్థరాత్రి ఈటలకు అనూహ్యంగా ఫోన్ చేసి సమాచారమిచ్చారు. అప్పటి నుంచి పలుమార్లు ఈటల రాజేందర్ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గులాబీ జెండా ఓనర్లం అంటూ మొదలైన వ్యాఖ్యలు, అనేక అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఒకదశలో సీఎం పదవి ఈటలకు ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా రాష్ట్రంలో వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో అసైన్డ్ భూమి కబ్జా ఆరోపణలు ఈటలను చుట్టుముట్టడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేందుకు దరఖాస్తు పెట్టుకున్నామని మంత్రి ఈటల వివరణ ఇచ్చినా… శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల్లో మెదక్ కలెక్టర్ ఈటల భూ కబ్జాను ధృవీకరిస్తూ సీఎస్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక సీఎం కేసీఆర్‌కు చేరకముందే ఈటల చేతిలో ఉన్న వైద్యారోగ్య శాఖను సీఎం చేతుల్లోకి బదిలీ చేసుకున్నారు. ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ ఇంకా చేయలేదు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.