చిన్న దేశమైనా.. కరోనాను జయించింది

by vinod kumar |
చిన్న దేశమైనా.. కరోనాను జయించింది
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా అగ్రదేశాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. దేశంలో వైరస్ విజృంభణను ఎలా అరికట్టాలా అని మథనపడుతూనే ఉన్నాయి. కానీ చైనాకు అతి సమీపంలో ఉన్న తైవాన్ దేశం మాత్రం కరోనాపై విజయం సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. చైనాకు అతి సమీపంలో ఉన్న ఈ చిన్న దేశంలోనికి కరోనా త్వరగానే సోకింది. కానీ, ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనాను అడ్డుకోగలిగింది. మొదట్లో కరోనా కేసులు నమోదైనా, గత కొన్ని వారాలుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం తైవాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. గత ఆరువారాలుగా అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసుకూడా నమోదు కాలేదు. చైనాలోని వూహాన్‌లో కరోనా మొదటిగా గుర్తించబడింది. ఈ నగరానికి తైవాన్‌కు అతి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. దీంతో మొదటిగా చైనా నుంచి వచ్చే వాళ్లకు పరీక్షలు చేయడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే వారిని సైతం వదలకుండా కరోనా పరీక్షలు చేసిన తర్వాతే దేశంలోనికి అనుమతించింది. చైనాలో డిసెంబర్‌లో కరోనా వైరస్‌ను గుర్తించగా.. తైవాన్ ప్రభుత్వం జనవరిలోనే లాక్‌డౌన్ అమలు చేసింది. దీంతో ఆ దేశంలో కరోనాను అతి త్వరగా నిలువరించగలిగారు. మరో విషయం ఏంటంటే.. తైవాన్ ఒక ద్వీప దేశం. అక్కడకు రావాలంటే విమానాలు తప్ప మరో గత్యంతరం లేదు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రభుత్వం మొదటిగా విమాన ప్రయాణాలపై కట్టడి విధించింది. విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు మొదలు పెట్టింది. ఇలాంటి కఠిన చర్యల కారణంగానే ఇవ్వాళ తైవాన్ కరోనా ప్రీ దేశంగా మారింది.

Advertisement

Next Story