150 వీధి కుక్కలను సాకుతున్న జార్ఖండ్ ఫ్యామిలీ

by Sujitha Rachapalli |
150 వీధి కుక్కలను సాకుతున్న జార్ఖండ్ ఫ్యామిలీ
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఇంట్లోని పెంపుడు జంతువులకు ఫీడ్ చేసేందుకే కొన్ని ఫ్యామిలీస్ కష్టపడుతుంటాయి. అలాంటిది ఒకటి, రెండు కాదు.. వందకు పైగా శునకాలకు ప్రతీరోజు ఫుడ్ అందించాలంటే మాటలా? కానీ ఇక్కడొక ఫ్యామిలీ మాత్రం మాటలతో ఆగిపోలేదు. దాదాపు సంవత్సర కాలంగా 150 వీధికుక్కలకు ఆహారం అందిస్తూ జంతు ప్రేమికులకు అసలైన నిర్వచనంగా నిలుస్తోంది. వారిలో ఈ ఆలోచన కలిగేందుకు దారితీసిన పరిస్థితులేంటో మీరూ తెలుసుకోండి..

జార్ఖండ్, రాంచీ సిటీలోని మోరబడికి చెందిన సేన్ ఫ్యామిలీ.. గతేడాది లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి తమ సేవలను కొనసాగిస్తున్నారు. 25 ఏళ్ల వయసున్న ఆర్చి సేన్, తన ఫాదర్ సంజీత్ కుమార్‌ సేన్‌తో కలిసి నిర్వహిస్తున్న ఫీడింగ్ డ్రైవ్ ద్వారా ప్రతీరోజు 150-160 కుక్కలకు ఫుడ్ అందిస్తోంది. మొదట్లో తమ గ్రామంలోని వంద వరకు శునకాలకు ఫుడ్ సప్లయ్ చేసిన ఆర్చి.. క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయింది. అయితే వీరి సేవలను ఆహారం వరకే పరిమితం చేయకుండా వాటికి వ్యాక్సిన్ వేయించడంతో పాటు డ్రీహైడ్రేషన్‌కు గురికాకుండా అనేక ప్రదేశాల్లో 50 వరకు నీటి తొట్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రమాదాల బారినపడకుండా ఉండేలా కుక్కలకు ఫ్లోరోసెంట్(ప్రకాశించే స్టిక్కరింగ్) వేయించారు.

‘చాలా వరకు వీధి కుక్కలు మార్కెట్ ఏరియాల్లో పండ్ల వ్యాపారులు పడేసిన ఫుడ్‌పైనే ఆధారపడతాయి. అయితే లాక్‌డౌన్‌ టైమ్‌లో వీటికి ఫుడ్ ఎలా దొరుకుతుందనే విషయం నన్ను ఆలోచింపజేసింది. వెంటనే మోరబడిలోని గ్రౌండ్‌కు వెళ్లి, అక్కడున్న కుక్కలకు బిస్కెట్లు వేస్తే క్షణాల్లో తినేశాయి. మరుసటిరోజు ఇంకా ఎక్కువ బిస్కెట్లు తీసుకెళ్లినా అంతే టైమ్‌లో తినేశాయి’ అని ఆర్చి చెప్పుకొచ్చింది. ఈ పర్సనల్ ఎక్స్‌పీరియెన్సెస్‌‌ ఆధారంగా ‘స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ రాంచీ’ పేరుతో పేజీని స్టార్ట్ చేసిన సేన్ ఫ్యామిలీ.. యానిమల్ లవర్స్, ఇతరులతో కమ్యూనిటీ ఏర్పాటు చేసి, డొనేషన్స్ స్వీకరిస్తున్నారు. ఈ మేరకు రోజుకు 200 వీధిశునకాలకు ఫీడ్ చేసే సామర్థ్యంతో సేవలందిస్తున్నారు. అయితే డబ్బుల రూపంలో కాకుండా డాగ్ ఫుడ్, వ్యాక్సిన్స్, మల్టీ విటమిన్స్, కాలర్ బెల్ట్స్, ఇతరత్రా వస్తువులను డొనేట్ చేయాల్సిందిగా దాతలను కోరుతున్నారు.

‘వీధికుక్కలకు ఫుడ్ అందించడం ద్వారా మేము పొందుతున్న అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ విషయంలో నా కూతురి ఇంట్రెస్ట్ చూసి, నేను సపోర్ట్ చేయడం మొదలుపెట్టా’ అని ఆర్చి తండ్రి సంజీత్ సేన్ వెల్లడించారు. ఇక ఆర్చి సేన్ మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరు జంతు సంరక్షణ, హింస గురించి చెబుతారు కానీ కొద్దిమంది మాత్రమే ఏదైనా చేసేందుకు ముందుకొస్తారు. కనీసం రోజుకు ఒక జంతువుకు అయినా ఆహారం అందించండి, అవి కూడా మన సొసైటీలో భాగమే’ అని కోరింది.

Advertisement

Next Story

Most Viewed