- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
365డేస్.. రోజుకో డూడుల్.. 88ఏళ్ల ఆర్టిస్ట్ టాలెంట్
దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ సమయంలో కొంతమందికి ఏమీ చేయాలో తోచక టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్‌తో కాలం గడుపుతుంటారు. కానీ మరికొంతమంది ఈ సమయాన్ని వృథా చేయకుండా తమలో దాగి ఉన్న కళను వెలికి తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు చెందిన 88 ఏళ్ల కళాకారుడు గత ఏడాది కాలం నుంచి ప్రతి రోజూ క్రమం తప్పకుండా ‘డూడుల్స్’ వేసి ఔరా అనిపించాడు.
న్యూహ్యాంప్‌షైర్‌లో జీవిస్తున్న ఆర్టిస్ట్ ‘సీమాన్’ చిన్ననాటి నుంచే బొమ్మలు గీయడాన్ని తన అలవాటుగా మార్చుకున్నాడు. కానీ కెరీర్ బిజీలో తగినంత సమయం దొరికేది కాదు. దాంతో 60ఏళ్ల వయసులో తన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రిటైరై, మళ్లీ తనకు ఇష్టమైన ‘ఆర్ట్’తో సావాసం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ పాండెమిక్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సీమాన్ మొదట తను మరిచిపోయిన కళను తిరిగి అలవాటు చేసుకోని, రోజుకు ఒక డూడుల్ గీయాలని నిశ్చయించుకున్నాడు. అలా డైలీ ‘డూడుల్స్’ గీస్తూ 365 రోజుల ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. ఈ పెద్దాయన రోజు ఆరు గంటలు డూడుల్స్ గీసేందుకు టైం కేటాయిస్తాడు. పెన్సిల్ స్కెచ్‌లతో ఔట్‌లైన్ గీసేసి.. దానికి సిరా, కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్‌తో జీవం పోస్తాడు. ఈయన గీసిన ఆర్ట్స్ తన కుమార్తె రాబిన్ హేస్ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడంతో పాటు.. ఫేస్‌బుక్‌లోనూ ఫోస్టు చేసింది. దాంతో చాలామంది అవి కావాలని అడగటం మొదలుపెట్టడంతో వాటిని ‘ఎట్సీ డాట్ కామ్’లో ఒరిజినల్స్‌తో పాటు ప్రింట్లను కూడా అమ్మడం ప్రారంభించింది. వాటితో వచ్చిన ఆదాయంలో సగభాగాన్ని స్వచ్ఛంద సంస్థలు, COVID-19 రిలీఫ్ ఫండ్, ఆనాథాశ్రమం, శరణార్థులకు సహాయపడే సంస్థలకు ఇచ్చేది.
“చిన్నప్పుడు నేను ఒంటరితనాన్ని ఇష్టపడేవాణ్ణి. కానీ ఆ తర్వాత ఎక్సోట్రవర్ట్‌గా మారిపోయాను. ఈ రెండో దశ మధ్యలో అంటే నా అంతర్ముఖ స్టేజ్‌లో. నా గదిలో డ్రాయింగ్ టేబుల్‌పై చిత్రాలను గీయడానికి చాలా సమయం వెచ్చించేవాడిని. మళ్లీ ఇన్నాళ్లకు నాకు నచ్చిన, నేను ప్రేమించే డ్రాయింగ్ పనిలో ఎంజాయ్ చేస్తున్నాను. జీవితంలో మనకు నచ్చిన పని చేస్తే వచ్చే ఆనందం మరెందులోనూ దొరకదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. మీకు దొరికిన విలువైన సమయంలో మీ మనసు కోరుకున్న పనిలో లీనమవండి లైఫ్ మళ్లీ కొత్తగా అనిపిస్తుంది’’. – సీమాన్, ఆర్టిస్ట్