- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్లకే ఈ-వేస్ట్ మిషన్.. వేల మందికి ఇన్‌స్పిరేషన్‌గా బాలిక
దిశ, ఫీచర్స్ : ఆరేళ్ల వయసులో అర్థవంతమైన ఆలోచనలతో ప్రతి ఒక్కరికి పర్యావరణంపై స్పృహ కలిగిస్తోంది ఈ చిన్నారి. చదివేది ఒకటో తరగతే అయినా ఈ-వేస్ట్ ప్రాజెక్ట్‌పై క్రియాశీలకంగా పనిచేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. సమాజం, మనుషుల గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కరికీ మెరుగైన భవిష్యత్ అందాలనే కాంక్షతో పలు ప్రాజెక్ట్‌ల్లో తను పనిచేయడమే కాక ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తోంది. ప్రస్తుతం ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ డ్రైవ్, బుక్ డొనేషన్, కిచెన్ ఫార్మింగ్ తదితర ప్రాజెక్టులపై పనిచేస్తున్న భువన్య.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను చెత్తలో పడేయకుండా సరైన రీసైక్లింగ్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు సూచిస్తోంది.
ఈ-వ్యర్థాలను విసిరేయడం వల్ల బయట ఉన్న కీటకాలు, జంతువులకు హాని కలుగుతుంది. సాధారణంగా చెత్తలో కలిసిపోయిన ఈ-వ్యర్థాలను వేరు చేసి తినడం జంతువులకు సాధ్యం కాదు. దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదకర పరికరాలను అలాగే మింగేస్తాయి. అందుకే వాడుకలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను పడేసే ముందు కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలి. వాటిని కొనుగోలు చేసిన దుకాణాల్లోనే తిరిగి ఇస్తే.. తమకు యాక్సెస్‌లో ఉన్న ఈ-వేస్ట్ రీసైక్లింగ్ కేంద్రాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భువన్య.. ప్రజల నుంచి ఈ-వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కేంద్రానికి పంపుతానని తెలిపింది. అంతేకాదు రోజువారీ ఇంట్లో పోగయ్యే చెత్తలో ఈ-వ్యర్థాలను వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
ఇతర ప్రాజెక్ట్‌లు..
ఈ-వేస్ట్ ప్రాజెక్ట్‌లో చురుగ్గా పనిచేస్తున్న భువన్య.. కిచెన్ ఫార్మింగ్ యాక్టివిటీస్‌తో పాటు ఒక బుక్ డొనేషన్ ప్రచారంలోనూ పాల్గొంటోంది. ఈ మేరకు తన వంతుగా 150కి పైగా పుస్తకాలను విరాళంగా ఇచ్చింది. దీంతో పాటు త్వరలోనే స్వీపర్లకు హైజెనిక్ కిట్స్ అందజేస్తానని చెప్తోంది.