వెంకన్న హూండీ గోవిందా

by Sridhar Babu |
వెంకన్న హూండీ గోవిందా
X

దిశ,ఇబ్రహీంపట్నం: వెంకన్న అనుగ్రహం,ఆశీర్వాదాల కోసం భక్తుల నుంచి నిలువు దోపిడీ కోరుకునే వెంకన్నకు చేదు అనుభవం ఎదురైంది. మంచాల మండలం లింగంపల్లి గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో గత రెండు సంవత్సరాలుగా భక్తులు తమ కానుకలను సమర్పించిన రెండు హూండీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని కొందరు దుండగులు దొంగిలిచారు.

వివరాల ప్రకారం.. ఆలయంలోకి రోజు మాదిరిగా పూజలు నిర్వహించేందుకు గ్రామానికి చెందిన మైలారం ఎల్లయ్య శనివారం తెల్లవారుజామున గుడికి వెళ్లారు. ఆయన గుడికి వెళ్లేసరికి తాళాలు పగిలిగిపోయి, హూండీలు కనిపించకపోయేసరికి గ్రామ సర్పంచ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హుండీలో సుమారు 50-60 వేల నగదు ఉండవచ్చని అంచనా, దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Next Story