ఉల్లి చోరీ…నాట్ ఏ సిల్లీ స్టోరీ….

by Shamantha N |
ఉల్లి చోరీ…నాట్ ఏ సిల్లీ స్టోరీ….
X

దిశ, వెబ్ డెస్క్:
ఉల్లిని… ఒకప్పుడు కోస్తే కన్నీరు వచ్చేది, ఇప్పుడు కొంటే కన్నీరు వస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో దాన్ని కొనాలంటేనే జనాలు భయపడి పోతున్నారు. కాగా ఉల్లి ధరలు పెరిగిపోవడంతో ఉల్లి దొంగతనాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఓ గోదాంలో నిల్వ వుంచిన ఉల్లిని దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ దొంగను అదుపులోకి తీసుకోగా ,మరో దొంగ పరారీలో ఉన్నాడు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం…..పూణేలోని దేవజలి గ్రామంలో ఓ గోదాంలో ఉల్లిని నిల్వ చేశారు. కాగా విషయం తెలుసుకున్న ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చారు. గోదాంలో నిల్వ వుంచిన ఉల్లి బస్తాలను చోరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే స్థానికుడు ఒకరు ఈ విషయాన్ని గమనించి కేకలు వేశాడు. దీంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఒక దొంగను స్థానికులు పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అయితే గోదాంలో నిల్వ వుంచిన 10 బస్తాల ఉల్లిని దోచుకుపోయినట్టు గుర్తించారు.

Advertisement

Next Story