నర్స్ ఫోన్ మిస్సింగ్.. బయటపడిన రాసలీలలు.. ఎలా తీశారంటే..?

by Anukaran |   ( Updated:2021-07-11 03:01:15.0  )
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమె ఒక హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. ఎంతో అందమైన కుటుంబం, హాస్పిటల్ లోను అంటే చురుకుగా పనిచేసేది. అయితే ఇటీవల ఆమె ఫోన్ పోయింది. ఫోన్ యే కదా పోయింది.. కొత్తది కొనుకోవచ్చులే అని వదిలేసింది. పదిరోజుల తర్వాత ఆమె ఫ్యామిలీ గ్రూప్ లో ఆమె నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి. ఎవరు ఇలాంటి పని చేసింది అని నెంబర్ చెక్ చేసి షాకయ్యింది. అది తాను పోగొట్టుకున్న ఫోన్ నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా అదే నెంబర్ నుంచి ఆమె భర్తకు ఫోన్ వచ్చింది. నీ భార్య హాస్పిటల్ లో ఉన్న సహోద్యుగులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అన్యోన్యంగా ఉన్న వారి కాపురంలో అనుమానం చిచ్చు రేగింది. భార్యాభర్తలు బద్ద శత్రువులా మారారు. ఇక వీటిని తట్టుకోలేని మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల రోజుల క్రితం ఆమె ఫోన్ పోయింది. దీంతో చేసేది లేక ఆమె కొత్త ఫోన్ కొని వాడుకుంటుంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్‌ అయ్యాయి. అంతే కాకుండా ఆమె పనిచేస్తు‍న్న ఆస్పత్రిలో మేల్‌ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్‌లో చెప్పాడు. దీంతో ఖంగుతిన్న భర్త, భార్యతో గొడవకు దిగాడు. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు.

ఆ ఫోటోలు అన్ని మార్ఫింగ్ చేసినవని, వాటి వాల్ల తన జీవితం నాశనం అయ్యిందని, దయచేసి ఆ ఫోటోలను షేర్ చేయడం ఆపమని మహిళ మీడియా ముందుకు వచ్చింది. తన భర్త తనను వదిలేసాడని, కుటుంబ సభ్యులు తనను నీచంగా చూస్తున్నారని వాపోయింది. త్వరలోనే నిందితుడ్ని పట్టుకొంటామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed