క్రిస్మస్ రోజు బహిరంగంగా అక్కడ గోక్కున్నాడు.. అరెస్టయ్యాడు!

by Anukaran |   ( Updated:2021-01-04 07:22:11.0  )
క్రిస్మస్ రోజు బహిరంగంగా అక్కడ గోక్కున్నాడు.. అరెస్టయ్యాడు!
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం చేసే చిన్నచిన్న పనులే పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే నేరాలకు పాల్పడే వాళ్లు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అతి చిన్న తప్పిదంతో పోలీసులకు చిక్కుతారు. అలాంటి ఘటనే కోల్‌కత్తాలో జరిగింది. అతడు క్షణకాలం పాటు చేసిన పొరపాటు కటకటాల్లోకి నెట్టేసింది. ఇంతకు అతడు ఏం చేశాడో తెలుసా..? దురద పుట్టిందని గోక్కోవడం. గోక్కుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..

కోల్‌కతాలోని జింజిరా బజార్‌కు చెందిన రతన్ భట్టాచార్య సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అతడి ఉద్యోగం పోయింది. మళ్లీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎక్కడా ఎలాంటి పనులు దొరకక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అతడిని గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి నిండైన మాస్క్ ధరించేవాడు.

డిసెంబర్ 25న కిడ్డర్‌పూర్ మాల్‌కు ఓ మహిళ షాపింగ్‌కు వచ్చింది. షాపింగ్ పనుల్లో ఆమె బిజీగా ఉండటాన్ని గమనించిన రతన్ భట్టాచార్య ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను దొంగిలించాడు. అందులోని రూ.99,300 లతోపాటు 10 యూఎస్ డాలర్లను కొట్టేశాడు. అక్కడి నుంచి జారుకుంటున్న సమయంలోనే అతడి ముఖంపై దురద పెట్టింది. ఏమరపాటులో ఉన్న రతన్ భట్టాచార్య ముఖంపై మాస్క్‌ను తీసి గోక్కున్నాడు. అంతే షాపింగ్ మాల్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో అతడి ఫేస్ రికార్డు అయింది. మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరీకి పాల్పడింది రతన్ భట్టాచార్యగా గుర్తించి అరెస్ట్ చేశారు. చిన్న దురద వరస చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టించడం విశేషం.

మూత్రవిసర్జనకు వెళ్లిన యువతి.. వెనకాలే వెళ్లిన యువకుడు..

Advertisement

Next Story