- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప వైఎస్సార్సీపీలో బాహాబాహీ, రాళ్లదాడి
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా వైఎస్సార్సీపీలో వర్గ పోరు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేసేందుకు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య బుధవారం గ్రామానికి చేరుకున్నారు. ఇది గిట్టని మరో వర్గం కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్‌రెడ్డి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు కలబడి బాహాబాహీకి దిగారు. అనంతరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో 8 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story