- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘థర్డ్ వేవ్’ ముప్పు లేదు.. పిల్లలను స్కూల్‌కు పంపండి : డీహెచ్
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్టానికి థర్డ్ వేవ్ ముప్పు లేదని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు మరోసారి తేల్చి చెప్పారు. వస్తుందనే శాస్ర్తీయ ఆధారాలు కూడా లేవన్నారు. వివిధ సంస్థలు ప్రకటించే సర్వేలు చూసి ప్రజలు పరేషాన్ కావొద్దని కోరారు. ఈనెల చివరి వరకు అర్హుల్లో కనీసం సింగల్ డోసుతో 100 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 200 మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్‌ను స్పీడప్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాల్లోనూ నిర్వహిస్తామన్నారు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువన్నారు. కరోనా వైరస్ పరిస్థితిపై బుధవారం ఆయన కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్ మాట్లాడుతూ..
పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్కూళ్లను ప్రారంభించిందన్నారు. కానీ పిల్లలను బడికి పంపేందుకు చాలా మంది ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల కొవిడ్ నిబంధనలతోనే పాఠశాలలను షురూ చేసినట్లు చెప్పారు. విద్యార్థులను ధైర్యంగా బడికి పంపించవచ్చన్నారు. అయితే సీజనల్, కరోనా లక్షణాలున్నోళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కూళ్లకు పంపించవద్దన్నారు. పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలా తక్కువన్నారు. ఒక వేళ సోకినా వంద శాతం మంది కోలుకుంటారన్నారు. కొవిడ్ సోకిన చిన్నారులెవ్వరూ ఇప్పటి వరకు మరణించలేదని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో చేరిన వారు కూడా వేగంగా రికవరీ అవుతున్నారని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇతర రాష్ర్టాలతో పోల్చితే మన దగ్గర రికవరీ రేట్ అత్యధికంగా 98.5 శాతం ఉందన్నారు. గడిచిన రెండు వేవ్ లలో 1 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో కేవలం 3 శాతం మంది వైరస్ బారిన పడ్డారన్నారు. 10 నుంచి 20 వయస్కుల్లో మరో 10 శాతం ఇన్ ఫెక్ట్ అయినట్లు గుర్తుచేశారు. కానీ 20 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఏకంగా 73 శాతం మంది వైరస్ కు ఎక్స్ ఫోజ్ అయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన రెండు వేవ్‌లలో 63 శాతం పెద్దలు, 50 శాతం పిల్లలకు యాంటీబాడీలు ఉన్నట్లు గతంలో సీరో సర్వే వెల్లడించిందన్నారు.
పక్క రాష్ర్టాల పరిస్థితులు రావు…
మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఉన్న పరిస్థితులు తెలంగాణలో లేవని డీహెచ్ వెల్లడించారు. పెళ్లిళ్లు, పార్టీలు, పండుగలు జరుగుతున్నా వైరస్ తీవ్రత అతి సాధారణంగా ఉన్నదన్నారు. ఎక్కువ మందిలో వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతిరక్షకాలు వృద్ధి చెందడమే దీనికి కారణమన్నారు. అంతేగాక చిన్నారుల్లో ఎక్కడ ఔట్ బ్రేక్స్ (ఒకే చోట ఎక్కువ మందిలో వ్యాప్తి ) రాలేదన్నారు. కానీ ముందస్తు జాగ్రత్తతో నిలోఫర్‌లో 800, గాంధీలో 300 పడకలతో పాటు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ సుమారు 2 వేలకు పైగా బెడ్లను సిద్ధం చేశామన్నారు.
భయపడాల్సిన అవసరం లేదు..
పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు పేరెంట్స్ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీహెచ్ తెలిపారు. ప్రతీ పాఠశాలలో థర్మల్ స్ర్కీనింగ్, శానిటేషన్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 95 శాతం మంది పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేశామన్నారు. వీరి ద్వారా పిల్లలకు వ్యాప్తి చెందే అవకాశం తక్కువన్నారు. పాజిటివ్ తేలిన పాఠశాలలను మ్యాప్ అప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేశామన్నారు. ఒకే స్కూల్‌లో 5 కేసులు తేలితే క్వారంటైన్ విధిస్తామన్నారు. సదరు పాఠశాలలో ఉండే విద్యార్థులకు, స్టాఫ్‌కు వెంటనే టెస్టులు చేస్తామన్నారు. పాఠశాలలోని అందరు పిల్లలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోమని ఆయా యాజమాన్యాలకు సూచించామన్నారు. అక్కడక్కడ కేసులు వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు.
పిల్లల్లో మానసిక సమస్యలు గమనిస్తున్నాం..
సుమారు 8 నెలల పాటు స్కూళ్లు మూసివేత కారణంగా చాలా మంది పిల్లల్లో మానసిక సమస్యలు వస్తున్నట్లు గుర్తించామని డీహెచ్ స్పష్టం చేశారు. దీంతోనే ప్రభుత్వం పాఠశాలలను తెరిచిందన్నారు. కానీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. పిల్లలు ఇంటికి రాగానే యూనిఫామ్ లను వేర్వేరుగా ఉంచి, క్లీన్ చేయాలన్నారు. పిల్లలకు మాస్కు, శానిటేషన్‌పై అవగాహన కల్పించాలన్నారు.