- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్సిటీల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండొద్దు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వర్సిటీల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండొద్దని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ టీజేఎస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థి జన సమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుస్తున్నారని, అయితే కొవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే విద్యార్థులు వైరస్ బారిన పడే అవకాశముందన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలని రెసిడెన్షియళ్లుగా మార్చాలని, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, ప్రవీణ్ ఆర్య, వినోద్ కుమార్, బాబు మహాజన్, అరుణ్ కుమార్, ప్రశాంత్, నరేందర్, వీరనాయక్, రాజేష్ నాయక్, శ్రీను, జీవన్, పవన్ పాల్గొన్నారు.