- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరంగల్‍ రూరల్‍లో నో ‘కరోనా’
దిశ, వరంగల్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్లో ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు కరోనాపై చైతన్యం కలిగిస్తోంది. సామాజికదూరం, స్వీయ రక్షణ పాటించాలని ఆదేశిస్తోంది. అయితే, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలతో వరంగల్ రూరల్ జిల్లా అధికార యంత్రాంగం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రీన్ ఛాలెంజ్ జాబితాలో రూరల్ జిల్లా చోటు దక్కించుకుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఆరు జిల్లాలుగా విభజించింది. రూరల్ జిల్లా చుట్టూరా ఉన్న వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ ఐదు జిల్లాలతోపాటు పక్కనే ఉండే పూర్వ కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా రూరల్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. మర్కజ్ ఘటన కంటే ముందు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు లేని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ తర్వాత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలోనే రెండోస్థానానికి చేరింది. ఉమ్మడి వరంగల్లో రూరల్ జిల్లా మినహాయిస్తే కేసుల సంఖ్య 33 కి చేరింది. ఇందులో అర్బన్ జిల్లాలో 25, భూపాలపల్లిలో 03, ములుగు 02, జనగామ 02, మహబూబాబాద్ 01 కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయి.
50 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారి
వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కొవిడ్ కట్టడికి ముందస్తుగానే వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. 50 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. టెలీ మెడిసిన్ సేవలు అందించేలా చూస్తూనే ఎప్పపటికప్పుడు
పరిస్థితులను పర్యవేక్షిస్తూ వైరస్ తీవ్రతను జనాలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేశారు. కరోనా వ్యాధి సోకే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తంగా లాక్ డౌన్ను విజయవంతంగా అమలు చేస్తున్నారు.
ముందస్తు చర్యలతో సక్సెస్
ఇప్పటి వరకు విదేశాల నుంచి వరంగల్ జిల్లాకు వచ్చిన వ్యక్తులు 100 మంది ఉన్నారు. 1,718 మంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. ఢిల్లీ మర్కజ్ ఘటన నేపథ్యంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే, మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ నుంచి మర్కజ్కు వెళ్లొచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 500 మందికి సరి పడేలా నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలలో మొత్తం 3 క్వారంటైన్, 21 మందికి చికిత్స అందించేలా ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటి వరకు 92 మందిని క్వారంటైన్కు తరలించారు.
కొత్త వ్యక్తులపై నిఘా పెట్టాం:
హరిత, కలెక్టర్, వరంగల్ రూరల్ జిల్లా మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చిన వారు రాష్ట్రమంతటా పర్యటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అర్బన్ జిల్లాలో 25 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు వచ్చాయి. రూరల్ జిల్లాకు చెందిన ప్రజలు ప్రతి పనికీ వరంగల్కు వచ్చి పోతుంటారు. అందుకే కొత్తగా గ్రామంలోకి వచ్చే వారిపై నిఘా పెట్టాం. వారికి పరీక్షలు నిర్వహిస్తూ ఇంటి నుంచి బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. దీంతో పాజిటివ్ కేసులు లేని జిల్లాగా వరంగల్ రూరల్ రికార్డులోకి ఎక్కింది.
Tags: no covid 19 positive cases, collector, district staff, efforts, warangal rural district