- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు డిగ్రీ కళాశాలలు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జిల్లాలోని ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినట్లు సమాచారం. ఈ కళాశాలలు మహేశ్వరం, ఉప్పల్, వికారాబాద్, పరిగి మండల కేంద్రాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేస్తూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సీఎం కేసీఆర్ మోక్షం కల్పించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సార్లు అప్పటి ప్రభుత్వాలను డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని మోర పెట్టుకున్నామని తెలిపారు. ఎట్టకేలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో భాగంగానే కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.