- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాష్ట్ర ప్రజలకు చల్లని వార్త.. రెండు రోజుల పాటు వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు మారిన వాతావరణం కాస్త ఉపశమనం కలిగించింది. గురువారం సాయంత్రం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షం (Brought rain) కురుస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రాత్రి.. ఆదిలాబాద్ నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం ప్రజలు, రైతులను ఉక్కిరి బిక్కిరి చేసింది. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) దాదాపు గంటపాటు దంచి కొట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షం ప్రభావంతో శనివారం ఉదయం రాష్ట్రం మొత్తం చల్లని వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగానే.. వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరో చల్లని కబురు చెప్పింది.
వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. తాజా అలర్ట్ (Alert) ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురవనుంది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో వచ్చే అకాల వర్షాల కారణంగా మామిడి, వరి, మొక్కజొన్న, మిరప వంటి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.
Read More..