AP: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల

by Shiva |
AP: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతోన్న స్టూడెంట్స్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) నిధులను విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ (Kona Shashidhar) వెల్లడించారు. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కాగా, మొదటి ధఫాలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) కింద ఇప్పటికే రూ.788 కోట్లు విడుదల చేసిన విషయం విదితమే. నేడు మరో రూ.600 కోట్లు విడుదల చేయడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దశల వారీగా బకాయిలను చెల్లిస్తున్నామని కోన శ్రీధర్ తెలిపారు. అదేవిధంగా ఫీజుల కోసం విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి గురిచేయకూడదని అన్నారు. అలాంటి ఘటనలు తమ దృష్టి వస్తే సదరు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను తరగతులకు రానివ్వకుండా ఆపడం, పరీక్షల సమమంలో హాల్‌ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే.. ఆ విషయాన్ని సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటామని కోన శ్రీధర్ వెల్లడించారు.

Next Story