కవిత మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు

by Sumithra |   ( Updated:2021-06-19 10:30:36.0  )
కవిత మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్ : దుకాణానికి వెళ్లి తిరిగొస్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు చైన్ లాక్కెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని శ్రీనివాస్ నగర్‌లో శనివారం సాయంత్రం వెలుగుచూసింది. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం జరిగిన తీరును పోలీసులు గుర్తించారు.

వివరాల్లోకివెళితే.. కవిత అనే వివాహిత దుకాణానికి వెళ్లి తిరిగొస్తుండగా అక్కడే కాపు కాచిన దుండగుడు ఒకరు వెనుకే ఫాలో అయి మెడలో నుంచి మూడు తులాల గొలుసును లాక్కెళ్లాడు. అనంతరం మరో వ్యక్తి రాగా ఇద్దరు కలిసి బైక్‌పై పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story