- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తగారింటికి వెళ్లివచ్చేసరికి..
X
దిశ, కామారెడ్డి : మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న రెండిళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో ఉన్న రూ.90 వేల నగదు, నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు మాదాసు శ్రీనివాస్, మాదాసు భాస్కర్ లు శనివారం రోజు వేరువేరు గ్రామాలకు వెళ్లారు.
శ్రీనివాస్ వేములవాడకు వెళ్లగా భాస్కర్ అత్తగారిల్లయిన గంభీరావుపేటకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి చేరుకోగా ఇళ్లలో బీరువాలో వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీంతో వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story