సొంత అన్ననే దారుణంగా చంపిన తమ్ముడు..

by Shyam |
సొంత అన్ననే దారుణంగా చంపిన తమ్ముడు..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : స్వయానా తన అన్నను ఓ తమ్ముడు హత్య చేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతన్ పల్లి గ్రామంలో జరిగింది. తనకన్నా కొంత ఎక్కువ పొలం తన అన్న పేరిట ఉండడంతో తనకు రావలసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని తమ్ముడు బుగ్గ అప్ప.. గత కొంత కాలం నుండి తన అన్న హనుమంతును కోరుతూ వచ్చాడు.

పలుమార్లు ఇరువురి మధ్య తగాదాలు నడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుడు ఇప్పుడు అంటూ హనుమంతు కాలయాపన చేస్తూ రావడంతో ఆగ్రహం చెందిన బుగ్గ అప్ప ఈరోజు తెల్లవారుజామున తన అన్నపై దాడి చేసి హత్య మార్చినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

Advertisement

Next Story