- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాట్ల యువతికి మైక్రోసాఫ్ట్‌లో రూ.2కోట్ల వార్షిక వేతనం
దిశ,డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లావాసికి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం లో పనిచేసే అవకాశం దక్కడమే కాదు.. కళ్లు చెదిరే ప్యాకేజీ దక్కింది. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన దీప్తి అనే యువతి ఆ సంస్థలో రూ.2కోట్ల వార్షిక వేతనం పొందనుంది.
ఈమె తండ్రి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దీప్తిని డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించడంతో పాటు ఆమె సాధించిన ఘనత పోలీసుశాఖకు గర్వకారణమని ట్వీట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీం ఇంఛార్జీ వెంకన్న కుమార్తె దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించడంతో డీజీపీ ఈ ట్వీట్ చేశారు. నగర పోలీస్‌కమిషనరేట్ క్లూస్ టీం ఇంఛార్జీ వెంకన్న కుమార్తె ఉన్నత ఉద్యోగం పొందడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
కాగా దీప్తి మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో వార్షిక వేతనం రూ.2 కోట్లతో సాఫ్ట్‌వేర్ కొలువు సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఈనెల 2న ఎంఎస్(కంప్యూటర్స్) పూర్తి చేసిన దీప్తి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈనెల 17న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.