పెళ్లికి ఏడాది ఆగమన్న తండ్రి.. ఆగలేకపోయిన కూతురు ఏం చేసిందంటే..?

by Sumithra |   ( Updated:2021-06-18 03:35:40.0  )
Bride Refusing to Marry Groom with Bad Eyesight
X

దిశ, వెబ్‌డెస్క్: ఈకాలం యువతకు ప్రాణం విలువ తెలియకుండా పోతోంది. చిన్న‌, చిన్న కార‌ణాల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థంచేసుకోలేక, నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవలే ఓ యువకుడు తల్లిదండ్రులు కుక్కను కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో యువతి తల్లిదండ్రులు పెళ్లి వాయిదా వేశారన్న బాధతో ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..

నెల్లూరులోని శెట్టిగుంట రోడ్డులో నివాసముంటున్న ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు. ఆరునెలల క్రితమే పెద్ద కూతురికి వివాహం జరిపించి అత్తవారింటికి పంపాడు. అసలే మధ్య తరగతి కుటుంబం.. ముగ్గురు కూతుళ్లు.. మధ్యలో కరోనా.. వీటివలన ఆ తండ్రి ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. ఇవన్నీ గుర్తించని రెండో కుమార్తె(19) తనకు పెళ్లి చేయాలనీ పట్టుబట్టింది. ఆరునెలల క్రితమే అక్కకు పెళ్లి చేసాం.. ఆ అప్పులే ఇంకా తీరలేదు.. ఒక ఏడాది ఆగు.. ఆ అప్పులు తీర్చి నీ పెళ్లి చేస్తానని కూతురికి నచ్చజెప్పాడు. అయినా యువతి మాట వినలేదు.

తల్లిదండ్రులపై గొడవకు దిగింది. తనకు వెంటనే పెళ్లిచేసి పంపాలని ఒత్తిడి చేసింది. దీంతో తండ్రి తన ఆర్ధిక స్తోమత సరిగా లేదని, ఏడాది తర్వాతనే వివాహం జరిపిస్తానని తెగేసి చెప్పాడు. తండ్రి మాటలకు మనస్థాపానికి గురైన యువతి గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడింది. కూతురు ఆలింగిదేమో అనుకోని సైలెంట్ గా ఉన్న తల్లి ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి తలుపులు పగులకొట్టి చూడగా యువతి విగతజీవిగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story