మీదనుంచి వెళ్లిన డీసీఎం… యువకుడికి గాయాలు

by Shyam |
మీదనుంచి వెళ్లిన డీసీఎం… యువకుడికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో ఓ యువకుడి ఎడమచెయ్యి నుజ్జునుజ్జయింది. ఈ ఘటన మునుగోడు మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… మండల కేంద్రానికి చెందిన కొమ్ము ముత్యాలు రెండో కుమారుడు విజయ్ చీకటిమామిడి వైపు బైక్‌పై వెళ్తున్నాడు. జనగాం నుంచి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొనడంతో కిందపడిపోయాడు. అదే సమయంలో వెనకాల నుంచి వస్తున్న డీసీఎం అతనిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో విజయ్ ఎడమ చెయ్యి నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed