- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే వధువును గడ్డివాము వద్దకు పిలిచి.. అలా చేసిన వరుడు
దిశ,వెబ్ డెస్క్ : కొద్దీ రోజుల్లో నచ్చినవాడితో పెళ్లి.. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంది… అందమైన భర్త వస్తున్నాడని ఊహల్లో విహరించింది… పెళ్ళికి ముందే కాబోయే వాడు తనను కలవడానికి వచ్చాడని ఎగిరి గంతేసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళింది.. చివరికి అతడి చేతిలో శవమై తేలింది…కాబోయే భార్యను కత్తితో నరికి చంపిన యువకుడి ఉదంతం బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే బీహార్‌లోని నలందా జిల్లా నూర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ కు గతనెలలో పక్క గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు చర్చించుకొని వీరిద్దరికి ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేయాలనీ నిశ్చయించారు.
ఇక నిశ్చితార్థం అవ్వడంతో యువతి, యువకుడితో ఫోన్ మాట్లాడం, బయట కలవడం లాంటివి చేస్తూ ఉండేది. ఇటీవల కాబోయే భర్త కలవాలి అంటూ కాల్ చేయడంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాత్రి ఇంటికి దగ్గర్లో ఉన్న గడ్డివాము వద్దకు వెళ్ళింది. అక్కడ యువతితో మాట్లాడిన ఆజాద్ తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్యచేశాడు. శవాన్ని ఎవరికి కనిపించకుండా పక్కనే ఉన్న గడ్డివాములో దాచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉదయం ఇంట్లో ఎక్కడా కనిపించని యువతి కోసం వెతికిన తల్లిదండ్రులకు గడ్డివాము వద్ద రక్తపు మరకలు ఉండడడం గమనించి, దాన్ని తొలగించి చూడగా విగతజీవిగా పడిఉన్న కూతురు కనిపించింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడు ఆజాద్ ని పోలీసులు అరెస్ట్ చేసారు.
యువతిని ఎందుకు చంపాల్సివచ్చింది అని అడగగా యువకుడు చెప్పిన సమాధానానికి పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు. నిశ్చితార్థం తర్వాత పెళ్ళికొడుకు స్నేహితులు అమ్మాయి సన్నగా ఉంది , నీకన్న హైట్ ఎక్కువ ఉందని హేళన చేసారని, అందుకే ఆమెను గడ్డివాము వద్దకు పిలిచి హత్యచేశానని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని రిమాండ్ కి తరలించారు.