- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను డెలివరీకి పంపి.. భర్త ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?
దిశ, కుత్బుల్లాపూర్: ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబంలో తీరని విషాదం నింపాయి. భార్య డెలివరీ సమయం దగ్గరపడటంతో డబ్బులులేక తన సోదరి ఇంటికి పంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం… నారాయణపేట జిల్లా మద్దూర్ మండల ప్రాంతానికి చెందిన మంగలి కృష్ణ(25) బతుకుదెరువు కోసం కుత్బుల్లాపూర్‌లోని అంగడిపేటకు వలసవచ్చాడు.
బార్బర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం ఓ అనాథ యువతిని పెళ్లిచేసుకొని అన్నీ తానై చూసుకుంటున్నాడు. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భార్య గర్భిణీ కావడంతో చేతిలో చిల్లిగవ్వ లేక డెలివరీ నిమ్మిత్తం సొంతూరులోని తన సోదరి ఇంటికి పంపించాడు. ఒంటరిగా ఉంటున్న కృష్ణకు అప్పులు గుర్తుకొచ్చి తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.