అతిగా శృంగారం చేస్తున్న భర్తకు ఆ విధంగా చెక్ పెట్టిన భార్య

by Anukaran |   ( Updated:2021-02-21 04:20:26.0  )
Wife and Husband
X

దిశ, వెబ్‌డెస్క్ : అతి ప్రసంగం.. అతి ప్రవర్తన ఎప్పటికైనా ప్రమాదకరమే. అతి చేస్తే ఏదైనా చేటే అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. భర్త అతిగా సెక్స్ చేస్తున్నాడని విసిగిపోయిన భార్య.. అతడికి విషమిచ్చి కడతేర్చింది. ఎంత చెప్పినా వినకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా అందియూర్ గ్రామానికి చెందిన నందకుమార్ (35).. మైథిలీ అనే యువతిని ఏడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన రెండు నెలలకే ఆమె గర్భం దాల్చింది. ఆ సమయంలో మైథిలీ అనారోగ్యానికి గురైంది. గర్భం వల్ల బాగా నీరసించి పోయింది. భార్యా అలా ఉన్నా.. నందకుమార్ మాత్రం రోజు శృంగారం కావాలని ఆమెను బలవంతం చేసేవాడు. శరీరం సహకరించడం లేదని, అనారోగ్యంగా ఉన్నానని భార్య ప్రాధేయపడినా నందకుమార్ తన కోరిక తీర్చే వరకు ఆమెను వేధించేవాడు.

మైథిలీ గర్భందాల్చి ఐదు నెలలు నిండినప్పట్టికీ భర్త తన మొండిపట్టును వీడలేదు. శారీరక సుఖం కోసం ఆమెను నిత్యం ఇబ్బంది పెడుతుండడంతో భార్య విసిగిపోయింది. భర్త సెక్స్‌వల్ హింసను భరించలేక అతడిని అంతమొందించాలనుకుంది. జనవరి 28న భర్త తినే ఆహారంలో విషం కలిపింది. అన్నం చేదుగా ఉందని భార్యకు చెప్పినా.. ఆమె పట్టించుకోకుండా అలాంటిది ఏమీలేదు తినండి అని చెప్పింది. ఆ తర్వాత రోజు నందకుమార్‌కు కడుపులో నొప్పి, విరోచనాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు.. నందకుమార్ రక్తంలో విషం కలిసినట్లు చెప్పారు.

నందకుమార్ బంధువులు భార్య మైథిలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఈరోడ్ పోలీసులు మైథిలీని అదుపులోకి తీసుకుని ఎంక్వేరీ చేశారు. మొదట తనకేం తెలియదని బుకాయించిన ఆమె.. ఆ తర్వాత నందకుమార్ వికృత చేష్టలను పోలీసులకు వివరించి భోరుమన్నది. అతడి సెక్స్‌వల్ కోరికలు తీర్చలేకే అన్నంలో విషం పెట్టానని ఒప్పుకున్నది. తనకు జ్వరం వచ్చి బెడ్ మించి లేవలేని స్థితిలో ఉన్నా.. భర్త తన కామ కోరికలు తీర్చుకునే వాడని విలపించింది. ఆ బాధలు జీవితాంతం భరించడం తనవల్ల కాదనే హత్యకు ప్లాన్ చేసినట్టు వివరించింది. కాగా నందకుమార్ ఆరోగ్యం విషమించి ఫిబ్రవరి 15న మృతి చెందాడు. భర్త శారీరక హింసతో అనారోగ్యం పాలైన మైథిలీని చికిత్స అందించి, పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story