ఘోరం.. తల్లీ కొడుకు కలిసి భర్తను దారుణంగా..

by Sumithra |
ఘోరం.. తల్లీ కొడుకు కలిసి భర్తను దారుణంగా..
X

దిశ, నల్లగొండ: మద్యానికి బానిసయ్యాడనే కారణంతో భర్తను భార్య, కుమారుడు కలసి కర్రలతో కొట్టిచంపేశారు. ఈ సంఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేళ్ల దుప్పలపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏరుకొండ లచ్చయ్య కుమ్మరి వృత్తిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో మద్యానికి బానిసై ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నాడనే నెపంతో లచ్చయ్య భార్య లలిత, నవీన్ ఎలాగైన తండ్రిని చంపాలనే సిద్ధపడ్డారు. అనుకున్నట్టుగానే 18న రాత్రి భార్య, కుమారుడు కలిసి లచ్చయ్యపై కర్రలతో కొట్టి హతమార్చారు. అతడు చనిపోయాడని తెలియగానే లలిత, నవీన్ పారిపోయారు.

మృతుడి కుమార్తె నందిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని విచారణ నిర్వహించారు.

Advertisement

Next Story