- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత బస్తీలో ఘోరం.. వార్డ్ బాయ్ చేత వైద్యం.. వికటించడంతో..
దిశ, చార్మినార్: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన స్వర్ణకారుడు వైద్యం వికటించి మృతిచెందాడు. ఈ ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. వార్డు బాయ్ ఇచ్చిన ట్రీట్మెంట్ కారణంగానే వైద్యం వికటించి చనిపోయాడని మృతుని బంధువులు, న్యాయవాదులు, టీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రి ముందు బైఠాయించారు. బెంగాల్ కు చెందిన అష్టరాయ్ 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ పాతబస్తీ ఝాన్సీబజార్‌కు వలస వచ్చాడు. ఝాన్సీబజార్‌లో ఓ జ్యువెల్లరీ దుకాణంలో స్వర్ణకారుణిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాయ్‌కు ఉన్నట్టుండి కడుపునొప్పి రావడంతో భార్య స్థానికంగా ఉన్న మెడ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ఉన్న సిబ్బంది రాయ్‌కు ఇంజెక్షన్ ఇవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటికే రాయ్ మృతిచెందాడని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. దాంతో కుటుంబభ్యులు స్థానిక టీఆర్ఎస్ నాయకుడు దీపాంకర్ పాల్ దృష్టికి తీసుకువచ్చారు.
మృతుని బంధువులు, న్యాయవాది ఎ.మాణిక్ ప్రభుగౌడ్, టీఆర్ఎస్ నాయకుడు దీపాంకర్ పాల్ తదితరులు మెడ్స్ ఆసుపత్రి ముందు పై బైఠాయించారు. ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వార్డు బాయ్‌తో చికిత్స చేయించారని, వెంటనే ఆసుపత్రిని సీజ్ చేసి, మృతుని కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకు దిగిన వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.