- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డులు సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్.. అయినా వెనక్కి తగ్గని కేంద్రం
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సందిగ్ధం నెలకొంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం… వెనక్కి తగ్గబోమని కేంద్రం తెగేసి చెబుతోంది. ఇలాంటి తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమ్మకాల్లో ఉత్పత్తిలో ఎన్నడూ లేని విధంగా రికార్డు సృష్టిస్తోంది. ఈ విషయాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ట్విటర్ వేదికగా తెలియజేసింది.
అమ్మకాల్లో, ఉత్పత్తిలో రికార్డు
ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే మరోవైపు స్టీల్‌ప్లాంట్ అమ్మకాల్లో, ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తోంది. జూలై నెలలో 540.8 టన్నుల స్టీల్ విక్రయాలు జరిపి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 35 శాతం అధికంగా అమ్మకాలు జరిగినట్లు సంస్థ వెల్లడించింది. ఏప్రిల్-జూలై మధ్య 1,538 వేల టన్నుల ఉక్కును విక్రయించినట్లుగా ఆర్ఐఎన్ ట్విటర్ వేదికగా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్- జూలై మధ్య 4నెలల కాలంలో 8% అదనంగా విక్రయాలు జరిపినట్లు ప్రకటించింది.
వెనక్కి తగ్గనంటున్న కేంద్రం
కరోనాలాంటి విపత్కరమైన సమయంలోనూ స్టీల్‌ప్లాంట్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టింది. తాజాగా ఉత్పత్తి, అమ్మకాల్లో జెట్ వేగంతో దూసుకుపోతుంది. ఈ పరిణామాలను అయినా పరిగణలోకి తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహకరించుకోవాలని వైసీపీతోపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్రాన్ని కోరుతున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, ఏపీ ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఢిల్లీలో రెండురోజులపాటు మహాధర్నా నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం 100శాతం ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్తోంది.
ఉక్కు పరిశ్రమ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను సాధ్యమైతే ప్రైవేటీకరణ చేస్తామని లేని పక్షంలో వాటిని శాశ్వతంగా మూసివేస్తామని, ఇదే తమ నిర్ణయమని చెప్తోంది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీ, కేంద్రమంత్రులకు లేఖలు రాసినప్పటికీ కేంద్రంలో ఎలాంటి మార్పులు రావడం లేదు. మరోవైపు కార్మికులు ఆందోళన చేసినా, స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతున్నా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.