భారీ రివార్డ్.. ఆచూకీ చెబితే 37 కోట్లు..

by vinod kumar |   ( Updated:2021-12-22 05:05:59.0  )
భారీ రివార్డ్.. ఆచూకీ చెబితే 37 కోట్లు..
X

దిశ, వెబ్ డెస్క్: నేరాలు చేసిన వారి వివరాలు కొన్ని సార్లు పోలీసులకు తలనొప్పిగా మారితే అప్పుడు ప్రజల సహయం కోరడం షరా మామూలే. ఇలాంటి భారీ ఆఫర్ నే అమెరికా ప్రకటించింది. బంగ్లాదేశ్ లో ఉంటున్న అమెరికా పౌరుడిపై దాడి చేసి కిరాతకంగా చంపేశారు. పరారీలో ఉన్న కుట్రదారుల్ని పట్టుకునేందుకు భారీ రివార్డు ను ప్రజల ముందు ఉంచింది. అక్షరాలా 37 కోట్లు ప్రకటించింది. అవిజిత్ రాయ్ అనే అమెరికన్ బ్లాగర్ మత ఛాందస వాదాన్ని విమర్శించే వారు.

అతను తన భార్య రఫీదా అహ్మద్ తో కలిసి ఢాకా లో ఉంటున్నాడు. మత ఛాందస వాదాన్ని విమర్శించినందుకు వారి పై 2015 ఫిబ్రవరిలో అల్ ఖైదాకు చెందిన ఉగ్రమూకలు దాడి చేశాయి. ఆ దాడిలో అవిజిత్ చనిపోగా ఆయన భార్యకు గాయాలు అయ్యాయి. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూ వచ్చింది. విచారణ వేగవంతం చేసి బంగ్లా న్యాయస్థానం మొత్తంగా ఆరుగురిని దోషులుగా గుర్తించింది.

అయితే అందులో ప్రధాన కుట్రదారులైన అక్రమ్ హుస్సేన్, సయ్యద్ జియావుల్ హక్ (మేజర్ జియా), లు ఇంకా ప్రభుత్వానికి పట్టుబడలేదు. పరారీలో ఉన్న వీరిని ఎలాగైనా పట్టుకోవాలని అమెరికా ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ అనే సంస్థ ఈ రివార్డ్ ను ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed