మద్యం మత్తులో యువకుల వీరంగం 

by srinivas |
మద్యం మత్తులో యువకుల వీరంగం 
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరిజిల్లా అనపర్తిలో మద్యం మత్తులో కారు నడుపుతూ గురువారం సాయంత్రం ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అనపర్తి బాపనమ్మ గుడి వీధిలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి.. కారు అక్కడే వదిలి పారిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి జరగలేదు.

కానీ విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి వైర్లు ఊగిపోవడంతో అక్కడ ఉన్న జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో కరెంటు వైర్లు తగిలి షాక్ కొట్టే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story