సంక్షేమానికి పెద్ద‌పీట: పువ్వాడ

by Sridhar Babu |
సంక్షేమానికి పెద్ద‌పీట: పువ్వాడ
X

దిశ‌, ఖ‌మ్మం : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమానికి పెద్ద‌పీట వేసిందని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ అన్నారు. శుక్ర‌వారం ఖ‌మ్మం న‌గ‌రంలోని క్యాంప్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం కేసీఆర్ బడ్జెట్‌లో సింహభాగాన్ని నీటిపారుదల శాఖకు కేటాయించగా, జిల్లాలో అత్యధికంగా నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, విద్యా, వైద్యం, సంక్షేమ పథకాలతోపాట ఇతర రంగాలకూ అధిక ప్రాధాన్యత ఇచ్చార‌న్నారు. జిల్లా సీతారామ ప్రాజెక్టు కూడా బ‌డ్జెట్లో నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.

తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించ‌డం శుభ‌ప‌రిణామంటూ మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఖ‌మ్మం న‌గ‌రం గ‌త మూడు నెల‌ల నుంచి అభివృద్ధి ప‌నులు జోరుగా సాగుతున్నాయ‌ని, దాని దృష్టిలో పెట్టుకొని ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు కేటాయించ‌డం సీఎం కేసీఆర్, మున్సిప‌ల్ మంత్రి కేటిఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ణ‌త‌లు తెలిపారు. ఈ నెల 27 న జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుంద‌ని మంత్రి తెలిపారు.

ఖమ్మం లో కొత్త బస్టాండ్ ప్రారంభం, ఐటీ హబ్ ఫేస్ 2 కి శంకుస్ఠాప‌న చేస్తార‌ని తెలిపారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్తుప‌ల్లిలో నూత‌నంగా నిర్మించిన మున్సిప‌ల్ భ‌వ‌నం శంకుస్ఠాప‌న చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ విలేక‌ర్ల స‌మావేశంలో ఎమ్మెల్సీ బాల‌సాని లక్ష్మీనారాయ‌ణ‌, జ‌డ్పిచైర్మ‌న్ లింగాల క‌మ‌ల్‌రాజు, సుడా చైర్మ‌న్ విజ‌య్‌కుమార్ కార్యాల‌య ఇంచార్జీ గుండాల కృష్ణ, డీసీసీబీ చైర్మ‌న్ కూరాకుల నాగ‌భూష‌ణం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed