- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Budget: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అసెంబ్లీ (Assembly)లో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మొదటి దఫాలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు గాను రూ.11,600 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో IIT-JEE, NEET కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు కల్పించబోతున్నామని ప్రకటిచించారు. గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40 శాతం, కాసటిక్ ఛార్జీలు 200 శాతం పెంచబోతున్నామని అన్నారు. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కడుపు మార్చుకుండా ఉచితంగా సాయంత్రం వేళ స్నాక్స్ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక సంక్షేమ వసతి గృహాల్లో ‘కామన్ డైట్’ స్కీం అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.
Read More..
తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖకు భారీగా కేటాయింపులు
TG Assembly: రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే!
TG Budget: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో ఊహించని విధంగా కేటాయింపులు