- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీ ప్రయాణం ఓ అడ్వెంచర్ థ్రిల్లర్.. సునీత విలియమ్స్ రాకపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు 9 నెలల నిరీక్షణ తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకుని వచ్చేందుకు నాసా- స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా క్రూ-10 మిషన్ చేపట్టి విజయవంతం అయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగుప్రయాణమైన సునీతా విలియమ్స్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
వ్యోమనౌక మొరాయించడంతో తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్.. దివి నుంచి భువికి సురక్షితంగా చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియమ్స్ (Sunita Williams)కి స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు.
‘సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. దివి నుంచి భువికి చేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లకు స్వాగతం. ఇది ప్రపంచ చరిత్రలోనే చారిత్రక ఘట్టం. ఎనిమిది రోజుల్లో తిరిగిరావాలని స్పేస్ స్టేషన్‌కి వెళ్లి 286 రోజులకు తర్వాత భూమికి చేరుకున్నారు. ఈ 286 రోజుల్లో.. 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు కానీ ఆశ్చర్యకరమైన రీతిలో భూమిని చేరుకోలేకపోయారు. వీరి ప్రయాణం ఒక థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీని తలపిస్తోంది.. ఇదో గొప్ప సాహస యాత్ర.. అసలు సిసలు బ్లాక్ బస్టర్.. వీరికి సాటే లేదు.. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు గొప్ప ధైర్యవంతులు’ అని పొగుడుతూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More..