- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సునీతా విలియమ్స్ ధైర్యం లక్షలాది మందికి స్పూర్తినిస్తుంది: ప్రధాని మోడీ

దిశ, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams) గత సంవత్సరం జూన్ నెలలో ఓ మిషన్ పనిలో స్టార్‌లైన్ క్యాప్సుల్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లగా వారు వెళ్లిన స్టార్‌లైన్ క్యాప్సుల్‌లో సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో వారం రోజుల్లో తిరిగి రావాల్సి వారు.. గత 9 నెలలుగా స్సేస్ లోనే ఉన్నారు.అయితే వారిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ (SpaceX Crew Dragon).. భారత కాలమానం ప్రకారం ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో ల్యాండ్ అయింది. ఈ ప్రయోగంలో సునీతా విలియమ్స్ తో పాటు అందరూ క్షేమంగా భూమ్మీదకు చేరుకున్నారు. అయితే సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత సురక్షితంగా తిరిగిరావడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ చేశారు. అందులో " సునీతా విలియమ్స్ ధైర్యసాహసాలు, ధైర్యం, అపరిమిత మానవ స్ఫూర్తికి పరీక్ష. సునీతా విలియమ్స్, Crew9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏమిటో మనకు మరోసారి చూపించారు.
తెలియని విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొన్న వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతరిక్ష అన్వేషణ అంటే మానవ సామర్థ్యం యొక్క పరిమితులను అధిగమించడం, కలలు కనే ధైర్యంతో ఆ కలలను సాకారం చేసుకునే ధైర్యాన్ని కలిగి ఉండటం. అలాంటి ఐకాన్ అయిన సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా ఈ స్ఫూర్తిని ప్రదర్శించారు. వారు సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాము. ఖచ్చితత్వం అభిరుచిని కలిసినప్పుడు, సాంకేతికత పట్టుదలను కలిసినప్పుడు ఏమి జరుగుతుందో వారు ప్రదర్శించారు" అని ప్రధాని మోడీ తన తెలుగు ట్విట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చారు.