అన్నివర్గాల అభివృద్దే మా ధ్యేయం: ఎమ్మెల్యే శంకర్ నాయక్

by Shyam |   ( Updated:2021-12-23 09:33:02.0  )
అన్నివర్గాల అభివృద్దే మా ధ్యేయం: ఎమ్మెల్యే శంకర్ నాయక్
X

దిశ, కేసముద్రం: పేద ప్రజల అభివృద్దే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మహాబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్టియన్స్ కు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభివృద్ధి కై కేసీఆర్ పరితపిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్దే మా ధ్యేయం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలు సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఒలం చంద్ర మోహన్, ఏఎంసి చైర్మన్ మర్రి నారాయణ రావు, నజీర్, వీరు నాయక్, ఊకంటి యాకుబ్ రెడ్డి, రావుల నవీన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story