- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరయాంజల్ ఆలయ భూములపై విచారణ షురూ
X
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా, శామీర్ పేట మండలంలోని దేవరయాంజల్ ఆలయ భూములపై కమిటీ విచారణ చేపట్టింది. సోమవారం ప్రభుత్వం.. నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది. దీంతో వెంటనే కమిటీలోని సభ్యులు రఘునందన్ రావు, ప్రశాంత్ జీవన్, భారతి హోలికెరి, శ్వేతా మహంతిలు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఆఘమేఘాల మీద దేవరయాంజల్‌లోని మాజీ మంత్రి ఈటల ఆధీనంలో ఉన్న 12 ఎకరాల భూమిలో నిర్మించిన షెడ్లను పరిశీలించారు. దాదాపు లక్ష చదరపు అడుగులలో నిర్మించిన షెడ్లతో పాటు లిక్కర్ గోడౌన్‌ను సైతం పరిశీలించి, ఆధారాలను సేకరించారు.
Advertisement
Next Story