అర్ధరాత్రి అక్కడనుంచి శబ్దాలు.. అనుమానమొచ్చిన అతను ఏం చేశాడంటే..?

by Shyam |   ( Updated:2021-09-16 02:17:21.0  )
అర్ధరాత్రి అక్కడనుంచి శబ్దాలు.. అనుమానమొచ్చిన అతను ఏం చేశాడంటే..?
X

దిశ, పరకాల: పరకాలలో దొంగల చేతివాటం ఎక్కువగా చూపిస్తున్నారు. ఈనెల 13వ తేదీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా దొంగలు పలువురి జేబులు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే పరకాల పట్టణంలో దొంగలు మరోమారు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. వివరాలలోకి వెళితే.. బుధవారం రాత్రి డీసీసీబీ బ్యాంకును దోపిడీ చేయడానికి దుండగులు యత్నించారు. బ్యాంకు వెనకవైపు గోడకు గడ్డపారతో కన్నం చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా బ్యాంకు పక్కనే నివాసముండే విక్రమ్ అనే వ్యక్తికి శబ్దాలు రావడంతో అనుమానం వచ్చింది. దీంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ ప్రసాద్ బాబు సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొనే సరికి దొంగలు పరారయ్యారు.

దొంగలు కాంపౌండ్ వాల్ దూకి దామెర చెరువు కట్టమీదగా పరారై ఉంటారని అనుమానిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు డాగ్ స్క్వాడ్ తో నేరస్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా పరకాల పట్టణంలో మరోమారు దొంగలు హల్ చల్ చేయడం ప్రజల్లో ఆందోళన కలగడమే కాకుండా పోలీసులకు ఈ ఘటన సవాల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed