రాయలసీమలోనే ఎక్కువ దాడులు : చినజీయర్ స్వామి

by srinivas |
Chinjiyar Swamy
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ జవహర్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. చినజీయర్ స్వామి వెంట టీటీడీ బోర్డు మెంబర్ జూపల్లి రామేశ్వరరావులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలయాలు మన దేశానికి, మన ధర్మానికి మూల కేంద్రాలు అని అన్నారు. కొందరు దుండగులు ఆలయాలపై దాడులు చేసి.. హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. ఆలయాలపై దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ట అని అన్నారు. ఆలయాల రక్షణ వ్యవస్థపై వైవీ సుబ్బారెడ్డి, వెల్లంపల్లికి సూచించామని తెలిపారు. ఆలయాల వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తే.. రాకపోకలు పెరిగి దుండగుల దాడులను నివారించవచ్చని అన్నారు. ఏపీలో ఎక్కువగా రాయలసీమలోనే ఆలయాలపై దాడులు జరిగాయని వెల్లడించారు. ధ్వంసమైన 27 ఆలయాలను పరిశీలించానని.. దానిపై ఆలయాల వివరణను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story