- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
దిశ, అచ్చంపేట: జీవో 317 లో ఉన్న లోపాలు, తప్పులు సీనియారిటీ లిస్ట్ లను సరిచేసి ఉపాధ్యాయులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ.. యుఎస్ పీసీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరుతున్న ఉపాధ్యాయులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రాత్రి నుంచి ఉపాధ్యాయులను జిల్లాలలో ముందస్తుగా అదుపులోకి తీసుకొని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
ఈ విధంగా ఉపాధ్యాయులు చేపడుతున్న నిరసనను అడ్డుకోవాలని, బలప్రయోగంతో అణచివేయాలని ప్రభుత్వ చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను భేషరతుగా విడుదల చేయాలని, అలాట్ మెంట్, పోస్టింగ్‌లలో ఉపాధ్యాయులకు జరిగే నష్టాన్ని నివారించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధ్యాయ సంఘాల తో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.