- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము చస్తేగాని మా ఊరుకు బస్సు వేయరా..
దిశ, మల్దకల్ : మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ అధికారులు బస్సు నిలిపివేయడం జరిగింది. ఈ సమస్యపై విద్యార్థులు గ్రామ ప్రజలు డిపో ముందు ధర్నా చేయడం ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం చుట్టపు చూపుగా రెండు మూడు రోజులు బస్సు గ్రామానికి పంపడం మళ్లీ బంద్ చేయడం ఆర్టీసీ అధికారులకు పరిపాటిగా మారింది. విద్యార్థులు గట్టిగా ఆర్టీసీ అధికారులను ప్రశ్నిస్తే మీరంతా మీ గ్రామంలోని ఆటోలను బంద్ చేయండి మేము బస్సు పంపుతామంటూ ఖరాఖండిగా చెప్పడం ఆర్టీసీ అధికారులకు అలవాటుగా మారింది.
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అమాయక విద్యార్థులు ఆటో డ్రైవర్లను ఆటోలు బంద్ చేయమని అడిగితే మేము ప్రభుత్వానికి రోడ్డు ట్యాక్స్ కడతాలేమా మేమెందుకు ఆటోలు బంద్ చెయ్యాలి అంటూ విద్యార్థులపై విరుచుకుపడడం జరుగుతుంది. గత్యంతరం లేక ప్రయాణ సమస్యపై ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని చిన్నారులు ప్రాణాలు అరచేతిలో అడ్డం పెట్టుకొని తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది.
బిజ్వారం గ్రామం నుండి గద్వాల్ హైవే రోడ్డు వరకు ఆయా గ్రామాల సర్పంచులు పెద్ద పెద్ద నేతలు ఉన్న కానీ ఈ సమస్యపై దృష్టి పెట్టకపోవడం మేము చేసుకున్న దౌర్భాగ్యం అని విద్యార్థులు ఎన్నికల్లో ఓటు వేసిన తల్లిదండ్రులపై గెలుపొందిన నాయకులపై మండిపడుతున్నారు. మేము ప్రయివేటు ఆటోలపై ప్రయాణం చేస్తున్న సమయంలో రోడ్డు యాక్సిడెంట్‌లో చస్తే కానీ నాయకులకు, అధికారులకు ఈ సమస్యపై చలనం రాదా మేము చస్తే నాయకులు అధికారులు చుట్టపు చూపుగా వచ్చి మా తల్లిదండ్రులను పరామర్శించి మా శవాలపై మట్టి చల్లుటకు మట్టి ఖర్చులు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలనుకున్నారా ? బిజ్వారం బస్సు కోసం ఇంకెన్నాళ్లు ధర్నాలు చేయాలి .. ఎంతమంది విద్యార్థుల బలిదానాలు కావాలా ? అంటూ ఇప్పటికైనా నిజంగా మేము తెలంగాణ రాష్ట్ర విద్యార్థులమే అయితే బిజ్వారం గ్రామానికి బస్సు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.