మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ అప్పుడే

by Shyam |   ( Updated:2021-06-26 08:38:06.0  )
Pv Narasimha Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 25 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించున్నారు. గతేడాది జూన్ 28 నుంచి నిర్వహిస్తున్న శత జయంతి వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈనెల 28వ తేదీన ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి, గవర్నర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ వేడుకలు ముగియనున్నాయి.

పుస్తక ప్రచురణ కోసం ఉప కమిటీ

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పుస్తక ప్రచురణ కోసం సీఎం కేసీఆర్ ఉప కమిటీని శనివారం ప్రకటించారు. ఉప కమిటీ సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, టంకశాల అశోక్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, పీవీ నరసింహారావు తనయుడు ప్రభాకర్, ఎమ్మెల్సీ వాణి దేవి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, భాషా సాంస్కృతిక సమాఖ్య సంచాలకుడు మామిడి హరికృష్ణ ఉన్నారు. ఈ పుస్తకాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed