యాసంగి వరిసాగులో తెలంగాణ రికార్డు

by Anukaran |
Telangana crop
X

దిశ, వెబ్‌డెస్క్: యాసంగి వరిసాగులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. గతేడాది యాసంగితో పోల్చితే ఈ ఏడాది 11 లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు వేశారు. 2014తో పోల్చితే నాలుగు రెట్లు పెరిగింది. ఈ ఏడాది యాసంగిలో మొత్తం 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కాగా, రెండోస్థానంలో నిలిచిన తమిళనాడుతో పోల్చితే తెలంగాణలో దాదాపు రెట్టింపు సాగయింది. రాష్ట్రంలో యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా.. లక్ష్యాన్ని మించి సాగుతో భళా అనిపించింది. నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ జిల్లాలు ముందువరుసలో నిలిచాయి. గత యాసంగిలో 39.31 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. ఈసారి ఏకంగా 11.18 లక్షల ఎకరాలు అధికంగా సాగయింది.

Advertisement

Next Story

Most Viewed