- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్యం రవాణాలో వేగం పెంచాలి
దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం రవాణాలో ఆలస్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మంత్రుల నివాసం ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యేలతో అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యాన్ని రవాణా చేసేందుకు వీలైనన్ని ఎక్కువ వాహనాలను వినియోగించాలని సూచించారు. మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్ లోడ్ చేయాలని ఆయా మిల్లుల్లో స్థలం సమస్య ఉంటే అందుబాటులో ఉన్న మరో మిల్లులకు, గోదాంలకు ధాన్యాన్ని మళ్లించాలని తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తుంటే చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని అధికారులను హెచ్చరించారు. క్రాప్ బుకింగ్ లో నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించవద్దని సూచించారు. కొన్ని జిల్లాల నుండి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం విజ్ఞప్తి వస్తుందని వీటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపడుతామని భరోసానిచ్చారు. హమాలీల సమస్యలు తీర్చేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పారు. తరుగు తీసే విషయంలో తరచూ ఫిర్యాదులు వస్తున్న ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మార్చి 31 లోపు పంటల కోతలు పూర్తయ్యేలా చూసుకుంటే ప్రకృతి విపత్తుల వలన ఎలాంటి పంటనష్టాలు ఉండవని చెప్పారు.