నేను గెలిస్తే మిమ్ముల్ని చంద్రమండలానికి తీసుకెళ్తా..

by Anukaran |   ( Updated:2021-03-25 05:49:06.0  )
నేను గెలిస్తే మిమ్ముల్ని చంద్రమండలానికి తీసుకెళ్తా..
X

దిశ,వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పార్టీలు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పలు వాగ్ధానాలు చేయడం చిత్ర విచిత్రంగా ప్రచారం చేయడం సాధారణం. ఎన్ని కలు సమీపిస్తుడడంతో పోటీ అభ్యర్థులు వరాల జల్లు కురిపిస్తున్నారు. తమిళనాట హోరా హోరీగా సాగుతున్న ఈ ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి సంచలన హామీలు చేశారు.

దక్షిణ మదురైనుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన శరవణన్ ఎవరూ ఊహించని విధంగా హామీలు గుప్పించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గ ప్రజలను చంద్రమండలం పైకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలానే ఇళ్లలో ఆడవాళ్ల పనికి సాయంగా ఇంటింటికీ రోబో పంపిణీ చేస్తానన్నారు. ప్రస్తుతం ఆయన హామీలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.

Advertisement

Next Story