- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విచ్చలవిడిగా మట్టి తోలకాలు.. నిద్రమత్తులో అధికారులు
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాహాడ్ మండలంలో మట్టి మాఫియా రోజు రోజుకు విచ్చలవిడిగా రెచ్చిపోయి మట్టి తోలకాలు చేస్తున్నారు. మండలంలోని సారపాక అడవిప్రాంతం నుండి యదేచ్చగా మట్టిని ట్రాక్టర్లతో, లారీలతో అక్రమంగా తరలిస్తుంటే పలుమార్లు అధికారులకు చెప్పినా, వాట్సాప్ ద్వారా సమాచారం అందించినా మండలంలో ఉన్న అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా మట్టివ్యాపారులకు, అధికారులకు సంబంధం ఏమిటని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు.
మండలంలో అధికారులు మట్టి వ్యాపారస్థులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందోనని మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఎంత అక్రమం జరిగినా చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో పగలు రాత్రి తేడా లేకుండా పెద్ద పెద్ద వాహనాలతో వీధుల్లో శబ్దాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ అక్రమంగా సంపాదిస్తున్నారని ప్రజలు, పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత అక్రమాలు జరిగిన అధికారులకు ఏమాత్రం పట్టింపులేదనే వాదన మండలంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైన సంబందించిన అధికారులు, జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలని మండల ప్రజలు, పలు సంఘాల నాయకులు కోరుతున్నారు.